: టీ టీడీపీ ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ... తాజా పరిస్థితులపై సమాలోచనలు
ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ తమ పార్టీలకు చెందిన ముఖ్యనేతలు, పోలీసు బాసులతో వరుస భేటీలకు తెరలేపింది. ‘టీ న్యూస్’కు ఏపీ పోలీసుల నోటీసులతో నేటి ఉదయం తెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రాష్ట్ర డీజీపీతో భేటీ కాగా, కొద్దిసేపటి క్రితం ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు టీ టీడీపీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఓటుకు నోటుపై చంద్రబాబు బృందం ప్రయోగించిన ఫోన్ ట్యాపింగ్ బాగానే పనిచేసింది. ట్యాపింగ్ పై పక్కా ఆధారాలను సిద్ధం చేసుకున్న చంద్రబాబు సర్కారు... వాటిని తన అమ్ముల పొదిలో పెట్టుకుని, టేపులపై తొలి దాడి చేసింది. ఈ క్రమంలోనే ‘టీ న్యూస్’కు నోటీసులు జారీ అయ్యాయి. తదుపరి అడుగు ఏ దిశగా వేద్దామన్న అంశంపై చంద్రబాబు టీ టీడీపీ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం.