: ఏపీలో ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల ఉపసంహరణ... 9 ఎమ్మెల్సీలు టీడీపీవే
ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. తొమ్మిది ఎమ్మెల్సీలు టీడీపీకి, ఒక ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దక్కాయి. తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్పీగా రెడ్డి సుబ్రహ్మణ్యం, విజయనగరం ఎమ్మెల్సీగా ద్వారపురెడ్డి జగదీష్, వైజాగ్ నుంచి ఎంవీవీఎస్ మూర్తి, పి.చలపతిరావులు, కృష్ణా జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేసిన రాజేంద్రప్రసాద్, బుద్ధా వెంకన్నలు టీడీపీ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇటు చిత్తూరు ఎమ్మెల్సీగా గాలి ముద్దుకృష్ణమనాయుడు, అనంతపురం ఎమ్మెల్సీగా పయ్యావుల కేశవ్ టీడీపీ తరపున ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు ఎమ్మెల్సీలుగా అన్నం సతీష్ ప్రభాకర్ (టీడీపీ), ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు (వైసీపీ) కూడా ఎన్నికయ్యారు. మిగిలిన కర్నూలు, ప్రకాశం జిల్లాలో టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.