: భర్తపై తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళకు లక్ష జరిమానా విధించిన కోర్టు


తన భర్త, అత్త, మామలపై గృహ హింస చట్టం కింద తప్పుడు ఫిర్యాదు చేసినందుకు ఓ మహిళకు ఢిల్లీ కోర్టు రూ. లక్ష జరిమానా విధించింది. చట్టాన్ని దుర్వినియోగం చేసి, భర్త నుంచి అక్రమంగా డబ్బు దోచుకోవాలనుకుందని కోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. తన అత్తామామలను వేధించేందుకు వాస్తవాలను మరుగున పడేసిందని వ్యాఖ్యానించింది. అంతేకాకుండా, కేసును కోర్టు డిస్మిస్ చేసింది. ఆమె నుంచి వసూలు చేసే జరిమానాను 'బ్లైండ్ రిలీఫ్ అసోసియేషన్' ఖాతాలో వేయాలని ఆదేశించింది. భవిష్యత్తులో ఇతరులు ఎవరూ గృహ హింస చట్టాన్ని తమ స్వార్థానికి వాడుకోరాదనే ఉద్దేశంతోనే ఈ జరిమానా విధించినట్టు తెలిపింది.

  • Loading...

More Telugu News