: ఢిల్లీ ఉపముఖ్యమంత్రికి రూ. 400 ఫైన్
ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కారు పరిమితికి మించిన స్పీడుతో వెళుతోందని ట్రాఫిక్ పోలీసులు రూ. 400 ఫైన్ వేశారు. ఈ మేరకు చలాన్ వేశారు. ఆ సమయంలో కారును సిసోడియా డ్రైవర్ నడుపుతున్నాడు. ఈ ఘటన జూన్ 12న జరిగింది. కజురీ చౌక్ ప్రాంతంలో వేగంగా వెళ్తోన్న సిసోడియా కారును ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆపి హెచ్చరించారు. అయినా, వేగంగానే వెళుతుండటంతో... ఆ కారును ఛేజ్ చేసి పట్టుకున్నారు. అనంతరం చలానా రాశారు. దీంతో, వెనుక సీట్లో ఉన్న సిసోడియా రూ. 400 చలానా కట్టారు. ఈ ఘటనపై స్పందించిన మరో ఆప్ నేత అశుతోష్... పోలీసులకు చలానా కట్టినందుకు సిసోడియాకు శాల్యూట్ అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలైతే ఇలా చేయరని తెలిపారు.