: వందమంది కేసీఆర్ లు వచ్చినా మా ప్రాజెక్టులను తాకలేరు: యరపతినేని


సాగర్ టెయిల్ పాండ్ తెలంగాణకు అప్పగించాలంటూ వాదులాడుతున్న టి.ప్రభుత్వ డిమాండ్ పై టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు స్పందించారు. వందమంది కేసీఆర్ లు వచ్చినా తమ ప్రాజెక్టులను తాకలేరన్నారు. తమ ప్రాజెక్టులను నిర్వహించుకునే శక్తి తమకుందని స్పష్టం చేశారు. గుంటూరు జిల్లాలో టెయిల్ పాండ్ వద్ద పరిస్థితిని యరపతినేని, పలువురు టీడీపీ నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాగార్జునసాగర్ మాదిరిగా టెయిల్ పాండ్ దగ్గర దౌర్జన్యం చేయాలని కేసీఆర్ చూస్తున్నారన్నారు. ఏపీపై కేసీఆర్ తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News