: కావాలనుకుంటే ఆసుపత్రికి వచ్చి విచారించుకోండి... ఏసీబీ ఏఎస్పీకి లేఖ రాసిన టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర


ఏసీబీ నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ కనపడకుండా పోయిన టీటీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఎట్టకేలకు స్పందించారు. ఓటుకు నోటు కేసులో తాను పూర్తిగా సహకరిస్తానని తెలంగాణ ఏసీబీ ఏఎస్పీకి లేఖ రాశారు. తాను తీవ్రమైన వెన్ను నొప్పితో బాధ పడుతున్నానని... డాక్టర్లు 10 రోజుల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని, కదలకూడదని సూచించారని లేఖలో పేర్కొన్నారు. అస్వస్థత నుంచి కోలుకున్నాక విచారణకు హాజరవుతానని... లేని పక్షంలో, ఆసుపత్రికి వస్తే మీ ప్రశ్నలకు సమాధానాలిస్తానని తెలిపారు. మరోవైపు, సండ్రకు ఏసీబీ అధికారులు ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీకి సండ్ర లేఖ రాయడం ఆసక్తిదాయకంగా మారింది. ఈ లేఖపై ఏసీబీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News