: పులి బొమ్మ పోగొట్టుకొని, నానాయాగీ చేసి ఎయిర్ పోర్టు అధికారులకు పిచ్చెక్కించిన బుడతడు


ఆ బుడతడి పేరు ఓవెన్. వయసు ఆరేళ్లు. తన తల్లిదండ్రులతో కలసి హ్యూస్టన్ వెళ్లేందుకు తంపా విమానాశ్రయానికి వచ్చాడు. తన వెంట తెచ్చుకున్న 'హాబ్స్' అనే పులిబొమ్మను ఎక్కడో పోగొట్టుకున్నాడు. దీంతో ఏడుపు మొదలు పెట్టాడు. తన బొమ్మ తనకు కావాల్సిందేనని గోల చేశాడు. ఏం చెయ్యాలో పాలుపోని ఓవెన్ తల్లిదండ్రులు విమానాశ్రయ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సెక్యూరిటీ సిబ్బందితో కలిసి ఎయిర్ పోర్టు మొత్తం వెతికారు. అణువణువూ సోదా చేశారు. చివరకు పిల్లలు ఆడుకునే ప్రాంతంలో 'హాబ్స్'ను గుర్తించారు. దాన్ని ఓవెన్ కు ఇవ్వడంతో కథ ముగియలేదు. వారి వెతుకులాట, అంతకుముందు బుడతడు చేసిన నానాయాగీ మొత్తం దృశ్యాలను సేకరించి 'ఎడ్వంచర్' పేరిట డాక్యుమెంటరీ రూపొందించారు. 'హాబ్స్' తో ఫొటోలు దిగి సంబరపడ్డారు. చివరికి ఓవెన్ తనకిష్టమైన 'హాబ్స్'ను వెంటపెట్టుకుని హ్యూస్టన్ వెళ్లాడు.

  • Loading...

More Telugu News