: ఆకాశం నుంచి పడుతున్న చేపలు... ఏరుకుంటున్న గోళ్లమూడి వాసులు
కృష్ణా జిల్లా నందిగామ మండలం గోళ్లమూడి వాసులు ఓ వైపు జోరుగా వర్షం కురుస్తున్నా, రోడ్లపైనే బుట్టలు పట్టుకుని అటూ ఇటూ తీరిక లేకుండా తిరుగుతున్నారు. ఎందుకనుకుంటున్నారా? అక్కడ ఆకాశం నుంచి వర్షపు చినుకులతో పాటు చేపలు పడుతున్నాయి. అది కూడా వాలుగ రకం చేపలు కావడంతో జనం ఎగబడుతున్నారు. నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జనం ఇంటిపట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా చినుకులతో పాటు చేపలు కూడా ఆకాశం నుంచి పడుతుండటంతో బుట్టలు చేతబట్టుకుని వర్షంలో తడుస్తూనే చేపల వేట సాగించారు.