: మోదీకి కృతజ్ఞతలు చెప్పిన రాహుల్ గాంధీ
భారత ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కృతజ్ఞతలు తెలిపారు. నేడు రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా, తన ట్విట్టర్ ఖాతా ద్వారా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. "కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఆయనకు దీర్ఘాయురారోగ్యాలు కలగాలని కోరుకుంటున్నా" అని అన్నారు. దీనిపై రాహుల్ గాంధీ కూడా ట్విట్టర్ ఖాతా ద్వారానే స్పందించారు. "మీ అభినందనలకు నా కృతజ్ఞతలు" అని పోస్టింగ్ ను ఉంచారు. కాగా, చాలా సంవత్సరాల తరువాత రాహుల్ తన జన్మదినాన్ని ఢిల్లీలో జరుపుకుంటూ ఉండడంతో కాంగ్రెస్ శ్రేణులు పెద్దఎత్తున తరలివచ్చాయి. తన నివాసంలో 45 కిలోల భారీ కేకును కాంగ్రెస్ నేతలు, కార్యకర్తల సమక్షంలో రాహుల్ కట్ చేశారు.