: టెయిల్ పాండ్ వద్దకొస్తే పల్నాటి పౌరుషం చూస్తారు: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని హెచ్చరిక


నాగార్జునసాగర్ టెయిల్ పాండ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లాతో పాటు ఏపీలోని పలు నియోజకవర్గాలకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కొద్దిసేపటి క్రితం టెయిల్ పాండ్ వద్దకు వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఈ సందర్భంగా గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ టెయిల్ పాండ్ ముమ్మాటికీ తమదేనని వ్యాఖ్యానించారు. టెయిల్ పాండ్ ను స్వాధీనం చేసుకునేందుకు వచ్చే తెలంగాణ ప్రజా ప్రతినిధులు, సిబ్బంది పల్నాటి పౌరుషాన్ని రుచి చూస్తారని ఆయన హెచ్చరించారు. దీంతో అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ నుంచి వచ్చిన వందలాది మంది పోలీసులు అక్కడే ఉన్నారు.

  • Loading...

More Telugu News