: మత వివక్షతో కేసీఆర్ పాలన సాగిస్తున్నారు: మంద కృష్ణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లింగ, మత వివక్షతో పాలన సాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. ఆయన పాలన రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధంగా సాగుతుందని ఆరోపించారు. ఈ మేరకు వరంగల్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తరచూ హిందూ దేవాలయాలనే సీఎం సందర్శిస్తూ వాటి అభివృద్ధికి వందల కోట్ల రూపాయలు ప్రకటిస్తున్నారన్నారు. వేములవాడ, యాదాద్రి మాదిరిగానే మెదక్ చర్చ్, మక్కా మసీద్ ల అభివృద్ధికి కూడా వంద కోట్ల రూపాయలు ఇవ్వాలని మంద కృష్ణ డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రకారం మనది సెక్యులర్ రాజ్యమని, కేసీఆర్ దానికి విరుద్ధంగా మత ప్రచారకుడిలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.