: చర్చ్ పై దాడితో కలత చెందిన ఒబామా


అమెరికాలో కలకలం రేపిన చార్లెస్టన్ కాల్పుల ఘటనతో అధ్యక్షుడు బరాక్ ఒబామా తీవ్రంగా కలత చెందారు. దక్షిణ కరోలినాలోని చార్లెస్టన్ లో ఓ చారిత్రక చర్చ్ పై దుండగుడు తుపాకీతో విచక్షణ రహితంగా కాల్పులు జరపగా, తొమ్మిదిమంది బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఒబామా మాట్లాడుతూ... అమాయకులు కడతేరిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర అగ్రరాజ్యాల్లో ఇలాంటి నరమేధాలు జరగడం లేదన్న వాస్తవాన్ని గుర్తించాలని అన్నారు. ఈ స్థాయిలో మారణకాండ ఇతర ప్రాంతాల్లో ఎక్కడా జరగడం లేదన్నారు. 'తుపాకీ'ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్నారు.

  • Loading...

More Telugu News