: ఇంటి మీద కూడా చంద్రబాబు లొల్లి చేస్తున్నారు: టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్


హైదరాబాదులో నివసించే ఎవరైనా సరే జీహెచ్ఎంసీ నిబంధనల మేరకే ఇల్లు కట్టుకోవాలని... ముఖ్యమంత్రిగా చాలా అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ మాత్రం తెలియకపోవడం విచిత్రంగా ఉందని టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. ఇంటి మీద కూడా చంద్రబాబు లొల్లి చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్సీగా ఎన్నికైన శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు జూబ్లీహాల్ లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం బూర నర్సయ్య మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా, శ్రీనివాస్ రెడ్డిపై పొగడ్తల వర్షం కురిపించారు. తెలంగాణ ఉద్యమంలో శ్రీనివాస్ రెడ్డి కీలకపాత్ర పోషించారని... తెలంగాణ జేఏసీకి, టీఆర్ఎస్ పార్టీకి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించారని కొనియాడారు.

  • Loading...

More Telugu News