: పుష్కరాలను శాంపిల్ గా చూపిస్తారు!


వచ్చే నెలలో గోదావరికి పుష్కరాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ లోగానే అంటే 7వ తేదీ నుంచి శాంపిల్ పుష్కరాలు జరగనున్నాయి. అదేంటని అనుకొంటున్నారా?... ఏమీ లేదు, పుష్కర ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూడాలన్న ఉద్దేశంతో నమూనా పుష్కరాలు నిర్వహించాలని, పుష్కర సమయాల్లో ఏలాంటి చర్యలుంటాయో, వాటన్నింటినీ ట్రయల్ వేయాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. రోజూ గోదావరి నదికి హారతివ్వడం నుంచి, నదీ కరకట్టల వెంబడి బాణసంచా వేడుకల వరకూ ట్రయల్ వేయాలని చంద్రబాబునాయుడు అధికారులకు సూచించారు. 25వ తేదీన తాను రాజమండ్రిలో పర్యటిస్తానని, ఆ సమయానికి నమూనా పుష్కరాలకు సంబంధించిన పనులు పూర్తి కావాలని ఆయన ఆదేశించారు. కడియం నర్సరీ పూలతో అలంకరణ, అన్ని రకాల వంటకాలతో కూడిన ప్రదర్శనలు, భద్రత నిమిత్తం సీసీ కెమెరాల ఏర్పాటు తదితరాలను ఆయన అధికారులతో సమీక్షించారు. పుష్కరాల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ఆటలు, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాలని ఆదేశించారు.

  • Loading...

More Telugu News