: మహారాష్ట్రలో న్యూడ్ మోడళ్ల పారితోషికం పెంపు


చిత్రకళలో శిక్షణ ఇచ్చేందుకు దేశంలో కొద్ది సంఖ్యలో ఫైన్ ఆర్ట్స్ కాలేజీలు నడుస్తున్నాయి. చిత్రకళ అన్న తర్వాత విద్యార్థులు అన్ని అంశాలపైనా కుంచె కదపాల్సిందే. ముఖ్యంగా, స్త్రీత్వాన్ని అత్యంత పొందికగా, నేర్పుగా, కడు రమణీయంగా కాన్వాస్ పై చిత్రించడమనేది చిత్రకారుల సిలబస్ లో ప్రాధాన్యత ఉన్న అంశం. ఇందుకోసం ఆయా కాలేజీలు కొందరు స్త్రీలను లైవ్ మోడళ్లుగా వినియోగించుకుంటాయి. నగ్నంగా, రోజంతా కదలకుండా బొమ్మలా ఉన్నా, వారికిచ్చే పారితోషికం ఏమంత గొప్పగా ఏమీ ఉండదు. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చేందుకు మహారాష్ట్ర సర్కారు నడుం బిగించింది. న్యూడ్ మోడళ్ల పారితోషికాన్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇకమీదట... నగ్నంగా, రోజంతా మోడలింగ్ చేస్తే రూ.1000 ఇస్తారు. ఆ పారితోషికం ఇంతకుముందు రూ.300గా ఉండేది. ఇక, అర్ధనగ్న మోడళ్లకు ఇప్పటిదాకా రోజుకు రూ.250 ఇస్తుండగా, దాన్ని రూ.600కి పెంచారు. ఆచ్ఛాదనతో మోడలింగ్ చేసేవారు ఇకపై రోజుకు రూ.400 పొందనున్నారు. ఇంతకుముందు వారి పారితోషికం రోజుకు రూ.200గా ఉండేది. 2011 ఫిబ్రవరిలో పాత రేట్లను నిర్ణయించగా, తాజాగా కొత్త రేట్లతో ప్రకటన చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచే కొత్త పారితోషికాలు అమల్లోకి వస్తాయి.

  • Loading...

More Telugu News