: కృష్ణానది జలాల పంపకాలపై కుదిరిన ఏకాభిప్రాయం
ఢిల్లీలో ఇవాళ నిర్వహించిన కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం ముగిసింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణానది జలాల పంపకాలపై ఏకాభిప్రాయం కుదిరింది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఏపీకి 519 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు కేటాయించారు. ఇక, నాగార్జున సాగర్ నుంచి ఏపీకి 164 టీఎంసీలు, తెలంగాణకు 100 టీఎంసీలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అటు, ప్రకాశం బ్యారేజికి 181.2 టీఎంసీలు కేటాయించారు.