: బీజేపీలో చేరిన ఒడిశా మాజీ సీఎం
కాంగ్రెస్ సీనియర్ నేత, ఒడిశా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ బీజేపీలో చేరారు. ఈ రోజు భువనేశ్వర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో తన కుమారుడు శిశిర్ తో కలసి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. కేంద్ర మంత్రులు ఓరమ్, ధర్మేంద్ర ప్రదాన్, పలువురు బీజేపీ సీనియర్ నేతల సమక్షంలో వారిద్దరూ పార్టీలో చేరారు. తన మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇచ్చి గమాంగ్ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. బీజేపీలో చేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ సందర్భంగా గమాంగ్ చెప్పారు. ఒడిశాలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.