: ఇవన్నీ ప్రళయానికి సంకేతాలే!: పోప్
పలు రకాల మానవ చర్యలపై పోప్ ఫ్రాన్సిస్ హెచ్చరికలు చేశారు. టెక్నాలజీ వెంట గుడ్డిగా పరుగులు తీయడం నుంచి శిలాజ ఇంధనాల వెలికితీత వరకు... ఎన్నో అంశాలు భూమండలాన్ని కోలుకోలేని విధంగా నాశనం చేస్తున్నాయని, అవని అసమాన సౌందర్యాన్ని, సుసంపన్నమైన వైవిధ్యాన్ని దూరం చేస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది క్యాథలిక్కులను ఉద్దేశించి వెలువరించిన లేఖలో పోప్ ఈ విషయాలను పేర్కొన్నారు. ఇవన్నీ ప్రళయానికి సంకేతాలేనని స్పష్టం చేశారు. ఈ పరిస్థితిని ఎంతో కాలం భరింపజాలమని అన్నారు. గ్లోబల్ వార్మింగ్, ఎల్ నినో వంటి విపరిణామాలను ఉదహరిస్తూ... స్వీయ వినాశనం నుంచి మానవాళి గట్టెక్కేందుకు సాంస్కృతిక విప్లవం రావాలని ఆకాంక్షించారు. ప్రకృతితో మన సంబంధానికి పునరుద్ధరణ ఉండదని స్పష్టం చేశారు. ఉన్నదాన్ని కాపాడుకోవడమే మన పని అని పేర్కొన్నారు.