: హృదయమున్న రోబో... ఎమోషన్స్ కు స్పందిస్తుంది!


జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త రోబోకు రూపకల్పన చేశారు. దీనిపేరు 'పెప్పర్'. దీనికి హృదయముంటుంది. అంటే, ఎదుటి వ్యక్తుల ఫీలింగ్స్ కు అనుగుణంగా స్పందిస్తుందన్నమాట. మనం నవ్వితే అదీ నవ్వుతుంది... మనం చప్పట్లు కొట్టి అభినందిస్తే, ఆ అభినందనలను ఆనందంగా స్వీకరిస్తుంది. కోపం, అసహనం, సంతోషం... ఇలా పలు రకాల భావోద్వేగాలను ప్రదర్శించగలదు. టెక్నాలజీ సంస్థ 'సాఫ్ట్ బ్యాంక్' ఈ రోబో సృష్టికర్త. ఈ రోబోకు కాళ్లు లేవు, చక్రాలపై నడుస్తుంది. టోక్యోలోని ఓ థియేటర్ లో దీన్ని గురువారం ప్రదర్శించారు. స్టేజ్ పై ఉత్సాహంగా కదిలిన ఈ రోబో పాట పాడి, డ్యాన్స్ చేసి అందరినీ అలరించింది. అందరూ అభినందిస్తూ చప్పట్లు కొట్టగా సంతోషం వ్యక్తం చేయడం విశేషం. దీనిపై సాఫ్ట్ బ్యాంక్ సీఈఓ మసయోషి సోన్ మాట్లాడుతూ... అలీబాబా గ్రూప్, ఫాక్స్ కాన్ సంస్థలతో కలిసి ప్రపంచవ్యాప్త అమ్మకాలకు తెరదీస్తామని చెప్పారు. ప్రస్తుతం సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు తనతో ఎలా ప్రవర్తిస్తున్నారన్న దానిపై ఆధారపడి ఈ రోబో స్వంత వ్యక్తిత్వాన్ని అభివృద్ది చేసుకుంటుందని వివరించారు. ప్రేమతో వ్యవహరించే రోబోలను అందించడమే తమ లక్ష్యమని సోన్ తెలిపారు.

  • Loading...

More Telugu News