: లలిత్ మోదీ వ్యవహారంలో కేంద్రం ఎదురుదాడి
లలిత్ మోదీ వ్యవహారంలో తమను ఇరకాటంలో పడేయాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పై కేంద్రం ఎదురుదాడికి దిగింది. లలిత్ మోదీ ఘనకార్యాలన్నీ యూపీఏ హయాంలోనే జరిగాయని, వాటిపై అప్పటి సర్కారు చర్యలేమీ తీసుకోలేదని దుయ్యబట్టింది. న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ... ఇప్పటికే కాంగ్రెస్ దేశవ్యాప్తంగా పునాది కోల్పోయిందని, పనేమీ లేకపోవడంతో ఏం సమస్య దొరుకుతుందా? అని ఆ పార్టీ నేతలు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అయితే, వారికి సమస్యలేవీ దొరకడంలేదని అన్నారు. అన్ని కుంభకోణాలు వారి హయాంలోనే చోటుచేసుకున్నాయని ఆరోపించారు. యూపీఏ పాలనలో లలిత్ మోదీపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? అతడిని భారత్ కు ఎందుకు తీసుకురాలేదు? అందుకు వారికి ఏం అడ్డొచ్చింది? అని ప్రశ్నించారు.