: కుటుంబ సభ్యులతో కలసి కేసీఆర్ రుద్రాభిషేకం


వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సతీమణితో కలసి రుద్రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన కుమార్తె, ఎంపీ కవిత, అల్లుడు కూడా పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారి దర్శనంకోసం కుటుంబ సమేతంగా వచ్చిన కేసీఆర్ కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తరువాత రుద్రాభిషేకం జరిగింది. అనంతరం ఆలయ మండపంలో సీఎం దంపతులకు వేద పండితులు ఆశీర్వచనం పలికారు. తరువాత ఆలయ అభివృద్ధిపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు.

  • Loading...

More Telugu News