: ధాటిగా ఆడుతున్న బంగ్లాదేశ్ ఓపెనర్లు
భారత్ తో జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ ధాటిగా ఆడుతోంది. 8 ఓవర్లు ముగిసే సరికి 8.25 రన్ రేటుతో 66 పరుగులు చేసింది. ఓపెనర్లు సౌమ్య సర్కార్ 33 (24 బంతులు, 6 ఫోర్లు) పరుగులు, తమీమ్ ఇక్బాల్ 30 (25 బంతులు, 3 ఫోర్లు, 1 సిక్స్) పరుగులతో స్కోరు బోర్డును ఉరకలెత్తిస్తున్నారు. భారత బౌలర్లలో ఉమేష్ యాదవ్ 3 ఓవర్లలో 28 పరుగులివ్వగా, భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 27 పరుగులిచ్చాడు. స్పిన్నర్ అశ్విన్ తన తొలి ఓవర్లోనో 11 పరుగులు సమర్పించుకున్నాడు.