: ప్రసార భారతి బోర్డు సభ్యురాలిగా కాజోల్?
ప్రసార భారతి బోర్డు సభ్యురాలిగా బాలీవుడ్ నటి కాజోల్ పేరును కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. బోర్డు పార్ట్ టైం సభ్యుల ఎంపిక కోసం షార్ట్ లిస్ట్ చేసిన ఏడుగురు అభ్యర్థుల పేర్లలో కాజోల్ పేరు కూడా ఉందట. వారిలో అనూప్ జలోటా, అశోక్ టాండన్, మిన్హజ్ మర్చెంట్ పేర్లు కూడా వున్నాయి. వీరిలో నలుగురుని ఎంపిక చేసి త్వరలోనే ప్రకటిస్తారని ఎకనామిక్స్ టైమ్స్ పత్రిక రాసిన కథనంలో పేర్కొంది. రాబోయే కొన్ని రోజుల్లో దూరదర్శన్ రూపురేఖల్ని పూర్తిగా మార్చివేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో దూరదర్శన్ ను వినోదం ప్రధానంగా పునరుద్ధరించాలని అనుకుంటున్నారు. కాబట్టి అందులో నిష్ణాతులైన వారిని తీసుకోవాలని భావిస్తున్నారని, అందుకే సినీ నటి కాజోల్ పేరు పరిశీలనకు వచ్చిందని తెలిసింది.