: అద్వానీ నిజం చెప్పారంటున్న కేజ్రీవాల్


ఇండియాలో మరోసారి ఎమర్జెన్సీ వచ్చే అవకాశాలు లేవని చెప్పలేమంటూ, బీజేపీ సీనియర్ నేత అద్వానీ చేసిన వ్యాఖ్యలతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఏకీభవించారు. అద్వానీ వ్యాఖ్యలు బీజేపీ వర్గాల్లో సంచలనం సృష్టించగా, కేజ్రీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, "ఎమర్జెన్సీపై అద్వానీ చేసిన వ్యాఖ్యల్లో నిజం ఉంది. బీజేపీ సర్కారు తమ తొలి ప్రయోగానికి ఢిల్లీని ఎంచుకుందా?" అని ప్రశ్నించారు. దేశంలో 40 ఏళ్లనాటి అత్యయిక స్థితి రాకుండా ఎటువంటి కవచాలూ లేవని, అందువల్ల ఆ పరిస్థితి మరోసారి రాదని తాను నమ్మకంగా చెప్పలేకపోతున్నానని అద్వానీ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News