: విజయవాడ కొండపై 'బాహుబలి' తరహా సాహసం
'బాహుబలి' ట్రయిలర్ చూశారా? అందులో ప్రభాస్ ఓ కొండచరియ అంచును పట్టుకుని వేలాడుతూ కనిపించిన సీన్ గుర్తుందా? అచ్చు అటువంటి ఫీట్ నే చేస్తున్నాడో వ్యక్తి. విజయవాడ ఇంద్రకీలాద్రి కొండను ఎక్కిన గుర్తు తెలియని ఓ వ్యక్తి ప్రమాదకరంగా ఉన్న కొండ అంచును పట్టుకుని వేలాడుతున్నాడు. అతను ఎవరో, ఎందుకు అక్కడికి వెళ్లాడోనన్న సమాచారం లేదు. కాగా, అతన్ని క్షేమంగా కిందకు దింపేందుకు ఆలయ అధికారులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ స్తంభించింది. ఈ విషయమై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.