: యుద్ధ విమానాన్ని కూల్చేసిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు


ఇరాక్ సైన్యానికి చెందిన యుద్ధ విమానాన్ని పడగొట్టామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రకటించారు. అంబార్ ప్రావిన్స్ లోని రమది పట్టణానికి ఉత్తరం వైపున ఈ విమానాన్ని కూల్చినట్టు తెలిపింది. ఐఎస్ఐఎస్ సున్నీ విభాగానికి చెందిన నేత సవా, ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించాడు. అతని పోస్టింగ్ ప్రకారం, రష్యాలో తయారై ఇరాక్ కు వచ్చిన ఎస్ యూ-25 రకం విమానం ఉగ్రవాదుల కాల్పుల తరువాత మంటల్లో చిక్కుపోయింది. ఆపై అదుపుతప్పి రమది వద్ద కుప్పకూలింది. కాగా, యుద్ధ విమానం కూలిన విషయమై ఇరాక్ ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి వుంది.

  • Loading...

More Telugu News