: హాలీవుడ్ రేంజ్ సాహసంతో కొడుకును కాపాడుకున్న తండ్రి


తన కుమారుడిని రక్షించుకునే ప్రయత్నింలో ఆ తండ్రి పెను సాహసాన్నే చేశాడు. ప్రాణాలకు తెగించి అతను చేసిన సాహసం సీసీటీవీల్లో నిక్షిప్తంకాగా, ఇప్పుడా వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది. వివరాల్లోకి వెళితే, జార్జియాలో మాల్కోమ్ మిల్లోన్స్ అనే వ్యక్తి తన కారులో ఇంధనాన్ని నింపుకునేందుకు వచ్చాడు. డబ్బు చెల్లించేందుకు భార్య స్టోర్ లోకి వెళ్లిన సమయంలో మాల్కోమ్ కొడుకును కారులోనే ఉంచి కిందకు దిగాడు. ఆ పక్కనే పొంచివున్న ఓ దొంగ కారులోకి ప్రవేశించి, దాన్ని దొంగిలించే ప్రయత్నంలో కారును ముందుకు దూకించాడు. దీన్ని చూసిన మాల్కోమ్ వెంటనే స్పందించి, కారుపై దూకి, డోరుకు వేలాడుతూ, దొంగను నిలువరిస్తూ, సుమారు 250 మీటర్ల దూరం కారుతో పాటు పరుగు పెట్టాడు. దొంగతో పోరాడే క్రమంలో అద్దం పగులగొట్టి, వాడి చెయ్యి విరిచి మరీ తన కొడుకును, కారును కాపాడుకున్నాడు. తండ్రి ప్రేమంటే అలానే ఉంటుంది కదా?

  • Loading...

More Telugu News