: ప్రారంభమైన 'రైతు చైతన్య యాత్ర'లు
రాష్ట్ర రెవెన్యూ శాఖమంత్రి రఘువీరారెడ్డి ఈ ఉదయం 'రైతు చైతన్యయాత్ర' లను లాంఛనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రారంభమైన ఈ యాత్రలో పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 రోజుల పాటు ఈ యాత్రలు జరగనున్నాయి. మండలాల వారీగా తయారుచేసిన షెడ్యూల్ ప్రకారం రోజుకు రెండు గ్రామాల్లో యాత్రలు పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని రఘువీరా ఈ సందర్భంగా కోరారు