: మధ్యాహ్నం 2.30 గంటలకు భారత్-బంగ్లాదేశ్ తొలి వన్డే


భారత్, బంగ్లాదేశ్ ల మధ్య మూడు వన్డేల సిరీన్ నేడు ప్రారంభం కానుంది. ఈ మధ్యాహ్నం 2.30 గంటలకు తొలి వన్డే ప్రారంభమవబోతోంది. మిర్పూర్ లోని షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. ఇప్పటికే బంగ్లాతో జరిగిన ఏకైన టెస్టు డ్రాగా ముగిసినప్పటికీ, భారత ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. దీంతో, మూడు వన్డేల్లో కూడా సత్తా చాటాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. ఇటీవల జరిగిన ప్రపంచ కప్ క్వార్టర్ ఫైనల్స్ లో బంగ్లాదేశ్ ను భారత్ ఓడించిన సంగతి తెలిసిందే. ధావన్, కోహ్లీ, రైనా, రోహిత్ శర్మ, రహానే, ధోనీలతో భారత బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉంది. భారత బౌలింగ్ విభాగం కూడా బంగ్లాదేశ్ కన్నా ఎన్నోరెట్లు మెరుగైన స్థితిలో ఉంది. మరోవైపు, మూడు వన్డేల్లో ఇండియాపై ఒక్క మ్యాచ్ అయినా గెలిచి సత్తా చాటాలనే కృత నిశ్చయంతో బంగ్లా కెప్టెన్ మోర్తజా ఉన్నాడు. మరోవైపు, మిర్పూర్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తున్నప్పటికీ... వర్షాకాలం కావడంతో పిచ్ స్వభావం మారే పరిస్థితులు లేకపోలేదు. తేమ కారణంగా వికెట్ పై బౌన్స్, టర్న్ లభించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News