: కేసులకు భయపడం...తెలంగాణ కుట్రలను ఆధారాలతో బయటపెడతాం: సోమిరెడ్డి ప్రకటన


ఏపీ ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రంగంలోకి దిగేశారు. తెలంగాణ సర్కారుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. ఉమ్మడి రాజధాని హైదరాబాదులో ఏపీ ప్రజలు, ప్రజా ప్రతినిధులను తెలంగాణ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తోందని ఆయన ఆరోపించారు. ఓటుకు నోటు కేసు సహా ఎలాంటి కేసులకూ తాము భయపడబోమని పునరుద్ఘాటించారు. ఓటుకు నోటు కేసులో తెలంగాణ సర్కారు కుట్రలను ఆధారాలతో సహా త్వరలో బట్టబయలు చేయనున్నామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News