: 'ఐ ట్రాకింగ్' టెక్నాలజీ వచ్చేస్తోంది... తొలుత విమానాల్లో!


విమానంలో వెళుతూ ఓ మంచి సినిమాను చూస్తూ అలానే నిద్రలోకి జారిపోయారా? తిరిగి లేచిన తరువాత మంచి సినిమా మిస్ అయిందే అన్న బాధ ఇకపై ఉండబోదు. తదుపరి తరం ఇన్-ఫ్లయిట్ ఎంటర్ టెయిన్ మెంట్ సాంకేతికతను పరిచయం చేస్తూ, పారిస్ ఎయిర్ షోలో థేల్స్ సంస్థ రూపొందించిన సాఫ్ట్ వేర్ అందరినీ ఆకర్షిస్తోంది. కళ్లు మూతపడితే, దాన్ని తెలుసుకుని, సదరు టీవీ ప్రోగ్రామ్ ను అక్కడే నిలిపివేస్తుందీ ఐ ట్రాకింగ్ టెక్నాలజీ. తిరిగి నిద్రలేవగానే ఆగిన సీన్ దగ్గరి నుంచి మళ్లీ మొదలవుతుంది. ఐ ట్రాకింగ్ సాంకేతికతను తొలుత విమానాల్లో అందుబాటులోకి తేనున్నామని థేల్స్ డైరెక్టర్ బ్రెట్ బ్లీచర్ వివరించారు. బిజినెస్ క్లాస్ విమానాల్లోని అన్ని సీట్లలో ఈ సాంకేతికత అందుబాటులోకి వచ్చేందుకు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు పట్టవచ్చని ఆయన అంచనా వేశారు.

  • Loading...

More Telugu News