: ముహూర్త బలం లేనప్పుడే చంద్రబాబు ప్రమాణం...అందుకే ఇబ్బందులన్న స్వరూపానంద సరస్వతి
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి ఎదురవుతున్న ఇబ్బందులపై విశాఖ శారదపీఠాధిపతి స్వరూపానంద సరస్వతి నోరు విప్పారు. ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ముహూర్త బలం లేనందునే చంద్రబాబుకు సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తేల్చిచెప్పారు. నేటి ఉదయం తిరుమల వచ్చిన స్వరూపానంద సరస్వతి శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ముహూర్త బలం లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కారణంగానే చంద్రబాబుకు వరుసగా సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. తిరుమల గగన వీధుల్లో విమానాలు తిరగడం దేశానికే అరిష్టమని స్వరూపానంద ఆందోళన వ్యక్తం చేశారు.