: చంద్రబాబును కలసిన వేం నరేందర్ రెడ్డి


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును ఆ పార్టీ తెలంగాణ నేత వేం నరేందర్ రెడ్డి కలిశారు. ఓటుకు నోటు కేసులో భాగంగా, నిన్న ఏసీబీ విచారణకు హాజరైన వేం... విచారణకు సంబంధించిన వివరాలను చంద్రబాబుకు వివరించినట్టు సమాచారం. అంతేకాకుండా, ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలను కూడా ఆయన చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. మరోవైపు, వేం నరేందర్ రెడ్డిని టి.ఏసీబీ అధికారులు ఈరోజు కూడా విచారించే అవకాశం ఉందన్న వార్తలు వినపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, విచారణను ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశం కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News