: పక్కా ఆధారాలుంటే ఆలస్యమెందుకు?: కదలండని అధికారులకు బాబు ఆదేశం


ఫోన్ ట్యాపింగ్ అంశంపై పక్కా ఆధారాలుంటే, ఇంకా ఆలస్యం ఎందుకని, తక్షణం నోటీసులు ఇచ్చి విచారణ ప్రారంభించాలని ఈ ఉదయం తనను కలిసిన పోలీసు అధికారులకు బాబు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది. ఏపీ డీజీపీ జేవీ రాముడు, ఏసీబీ చీఫ్ మాలకొండయ్య, ఇంటెలిజెన్స్ చీఫ్ అనురాధలతో తన నివాసంలో సమావేశమైన ఆయన ఫోన్ ట్యాపింగ్ పై పోలీసులు సేకరించిన ఆధారాలను పరిశీలించారు. నోటీసులు పంపే ముందు మరోసారి న్యాయనిపుణుల సలహాలు తీసుకోవాలని, కేసులో గట్టి ఆధారాలతో ముందుకెళ్లాలని ఆయన సూచించినట్టు సమాచారం. ఈ కేసులో అనుమానాలు వచ్చిన అందరు అధికారులు, నేతలను విచారించాలని ఆయన చెప్పినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News