: శాంసంగ్ ఫోన్లు వాడుతుంటే జాగ్రత్త సుమా... హ్యాకింగ్ ముప్పు పొంచివుంది!
ప్రపంచవ్యాప్తంగా సుమారు 60 కోట్ల శాంసంగ్ ఫోన్లను వాడుతున్న వినియోగదారులు హ్యాకింగ్ బారిన పడనున్నారని బ్రిటన్ కు చెందిన ‘నౌ సెక్యూర్’ సంస్థ హెచ్చరిస్తోంది. ఈ ఫోన్లలోని ‘స్విఫ్ట్ కీ’ కీబోర్డు వల్ల సమాచారాన్ని సులభంగా హ్యాక్ చేసే ప్రమాదముందని, జీపీఎస్, కెమెరా, మైక్రోఫోన్ వంటి ఆప్షన్లలోకి ఈజీగా వెళ్లి వైరస్ లను ప్రవేశపెట్టవచ్చని నౌ సెక్యూర్ సంస్థ ప్రతినిధి ర్యాన్ వెల్టన్ నిరూపించారు. ముఖ్యంగా శాంసంగ్ మార్కెటింగ్ చేస్తున్న ‘గెలాక్సీ ఎస్ సిరీస్’ ఫోన్లన్నిటిలో ఈ కీబోర్డు ఉందని, ఇది రహస్యంగా హానికారక యాప్స్ ను మొబైల్‌లోకి పంపించేందుకు సహకరిస్తోందని ఆయన అన్నారు. దీన్ని తొలగించే వీలు లేనందున స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు హ్యాకింగ్ సమస్యలు తప్పకపోవచ్చని, ఈ స్విఫ్ట్ కీవల్ల ఏర్పడనున్న సమస్యలను శాంసంగ్ సంస్థకు వివరించామని ఆయన తెలిపారు.