: హైదరాబాదులో పెరిగిన ఏపీ పోలీసు బలగాలు...మరో ‘కంపెనీ’ని మోహరించిన చంద్రబాబు సర్కారు


ఓటుకు నోటు కేసులో తెలుగు రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీసులు కల్పిస్తున్న భద్రతపై అనుమానాలు వ్యక్తం చేసిన ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, తన సొంత రాష్ట్రానికి చెందిన పోలీసు బలగాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే తన నివాసంతో పాటు టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్, ఏపీ సెక్రటేరియట్, మంత్రుల నివాసాల వద్ద 400 మంది ఏపీ పోలీసులను రంగంలోకి దించారు. తాజాగా నిన్న మరో కంపెనీ (125 మంది) పోలీసులను ఏపీ సర్కారు హైదరాబాదుకు తరలించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఆరో బెటాలియన్ నుంచి ప్రభుత్వం ఈ బలగాలను హైదరాబాదుకు రప్పించింది.

  • Loading...

More Telugu News