: స్టీఫెన్ సన్ ను దేశం దాటించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది... రెడ్ కార్నర్ నోటీసు జారీ చెయ్యాలి: రాజేందర్ రెడ్డి


టీ సర్కారు ప్రముఖులపై ఏసీబీకి ఫిర్యాదు చేసిన అనంతరం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఓటుకు నోటు వ్యవహారంలో కీలక వ్యక్తి స్టీఫెన్ సన్ ను దేశం దాటించాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వెంటనే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసి స్టీఫెన్ సన్ దేశం విడిచి వెళ్లకుండా చూడాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వంలో పనిచేసేందుకు అధికారులు భయపడుతున్నారని తెలిపారు. మే 20 నుంచి జూన్ 5వ తేదీ వరకు ఇంటెలిజెన్స్ ఐజీతో మంత్రి హరీశ్ రావు 50 సార్లు మాట్లాడారని వెల్లడించారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇక, టీఆర్ఎస్ నేతలు తమను ఎన్నో ప్రలోభాలకు గురిచేశారని టీడీపీ ఎమ్మెల్యేలు తమ ఫిర్యాదులో ఆరోపించారు. సండ్ర వెంకటవీరయ్యకు టీఆర్ఎస్ నేత గంపా గోవర్థన్ తో ఎన్నోసార్లు ఫోన్లు చేయించారని తెలిపారు. పార్టీ మారకపోతే కుటుంబ సభ్యులకు హాని తలపెడతామంటూ బెదిరించారని ఫిర్యాదులో వివరించారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కేసీఆర్ అపహాస్యం చేశారని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నేతలపై యాంటీ కరప్షన్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయాలని కోరారు.

  • Loading...

More Telugu News