: కేసీఆర్ పై నమోదైన కేసుల దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై, ఇతరులపై ఏపీలో నమోదైన 88 కేసుల దర్యాప్తు కోసం సర్కారు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ బాధ్యతలను డీఐజీ మహ్మద్ ఇక్బాల్ కు అప్పగించారు. ఆయన నేతృత్వంలో సిట్ కార్యకలాపాలు సాగుతాయి. ఓటుకు నోటు వ్యవహారంలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు, చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నేపథ్యంలో ఏపీలో కేసీఆర్ పై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వీటి దర్యాప్తు కోసం ఇక్బాల్ సహా నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఫోన్ ట్యాపింగ్, ఇతర కేసులపైనా సిట్ దర్యాప్తు చేస్తుంది.