: బంజారాహిల్స్ పీఎస్ లో నారా లోకేశ్ పై ఫిర్యాదు
తెలంగాణ సీఎం కేసీఆర్ పై టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కన్వీనర్ నారా లోకేశ్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ తెలంగాణ న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో రాజకీయాలు చేస్తారని, కేసీఆర్ చేసేవి గల్లీ రాజకీయాలని నారా లోకేశ్ అన్నట్టు నిన్న (మంగళవారం) మీడియాలో కథనాలు వచ్చాయి. దీనిపై మండిపడిన టి.న్యాయవాదులు లోకేశ్ పై హైదరాబాదు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఇష్టంవచ్చినట్టు మాట్లాడిన లోకేశ్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.