: వేం నరేందర్ రెడ్డి అరెస్ట్ కాలేదు... ఏసీబీ కార్యాలయం నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన వేం!


టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయినట్టు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని తేలిపోయింది. ఈ ఉదయం 11.20 నుంచి ఆరు గంటల పాటు వేం నరేందర్ రెడ్డిని తమ కార్యాలయంలో ఏసీబీ అధికారులు విచారించారు. కాసేపటి క్రితం వేం నరేందర్ రెడ్డి విచారణ ముగిసింది. అనంతరం ఆయన ఏసీబీ కార్యాలయం నుంచి నవ్వుతూ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, విచారణలో ఏసీబీ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చానని చెప్పారు. ఎప్పుడు విచారణకు పిలిచినా, రావడానికి తాను సిద్ధమని చెప్పినట్టు తెలిపారు. విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని వేం అన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదని... ఇది కేవలం కుట్రపూరితంగా నమోదు చేసిన కేసు అని తెలిపారు. అనంతరం, ఆయన కారెక్కి తన నివాసానికి వెళ్లిపోయారు.

  • Loading...

More Telugu News