: అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లకు 'పింక్ బాల్స్' వచ్చేశాయ్!


ఇంతవరకు క్రికెట్ లో వన్డే మ్యాచ్ లకు తెలుపు రంగు బాల్స్, టెస్టు మ్యాచ్ లకు ఎరుపు రంగు బాల్స్ ఉపయోగిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా పింక్ బాల్స్ కూడా రంగప్రవేశం చేస్తున్నాయి. త్వరలో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టబోతున్న 'డే అండ్ నైట్' టెస్టు మ్యాచ్ ల కోసం ఈ గులాబీ రంగు (పింక్ బాల్స్) బంతులను సిద్ధం చేశారు. ఈ విషయాన్ని క్రికెట్ బాల్స్ తయారీ సంస్థ కూకబురా తెలిపింది. మెరిల్ బోన్ క్రికెట్ క్లబ్, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు, క్రికెట్ ఆస్ట్రేలియా గత ఐదు సంవత్సరాల నుంచి ఈ పింక్ బాల్స్ ను ఇప్పటికీ పరీక్షిస్తూనే ఉన్నాయని చెప్పింది. ఈ క్రమంలో అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ లలోనూ ఈ బంతిని ఉపయోగించవచ్చని కూకబురా చెబుతోంది. ఇప్పటికే దేశవాళీ పోటీల కోసం దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ బోర్డులకు ఈ గులాబీ బంతులను సప్లయ్ చేశామని, ఇరు బోర్డులు సంతృప్తి వ్యక్తం చేశాయని ఆ సంస్థ ఎండీ బ్రెట్ ఇలియట్ పేర్కొన్నారు. నవంబర్ లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి 'డే అండ్ నైట్' టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో పింక్ బాల్స్ ను ఉపయోగించుకోవచ్చని కూకబురా చెప్పింది.

  • Loading...

More Telugu News