: ఏసీబీ కోర్టుకు చేరుకున్న స్టీఫెన్... కాసేపట్లో వాంగ్మూలం నమోదు
ఓటుకు నోటు వ్యవహారంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కేంద్రబిందువుగా నిలిచిన టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కాసేపటి క్రితం నాంపల్లిలోని ఏసీబీ కోర్టుకు చేరుకున్నారు. స్టీఫెన్ తో పాటు ఆయన కుమార్తె, ఇంటి యజమాని కూడా కోర్టుకు వచ్చారు. కాసేపట్లో స్టీఫెన్ సన్ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేయనుంది. ఇండియన్ ఎవిడెన్స్ చట్టం ప్రకారం స్టీఫెన్ తన వాంగ్మూలాన్ని కోర్టుకు ఇవ్వనున్నారు. స్టీఫెన్ కోర్టుకు వస్తున్న నేపథ్యంలో, కోర్టు పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆయన వెంట రెండు టాస్క్ ఫోర్స్ బృందాలు కూడా ఉన్నాయి.