: రూ. 640 కోట్లకు పైగా ఆస్తులున్న భారత కుటుంబాల సంఖ్య 928


ఇండియాలో 100 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 640 కోట్ల రూపాయలు) ఆస్తులున్న కుటుంబాల సంఖ్య 928కి పెరిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యధికంగా ధనవంతులు నివసిస్తున్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానానికి ఎగబాకింది. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ 'గ్లోబల్ వెల్త్ 2015: విన్నింగ్ ది గ్రోత్ గేమ్' పేరిట నివేదికను విడుదల చేయగా, చైనా, ఇండియాల్లో ధనవంతుల సంఖ్య శరవేగంగా పెరుగుతున్నట్టు వెల్లడైంది. ఈ జాబితాలో అల్ట్రా హై నెట్ వర్త్ (యూహెచ్ఎన్ డబ్ల్యూ) కుటుంబాలు అధికంగా ఉన్న దేశాల్లో అమెరికా (5,201) తొలి స్థానంలో నిలువగా, చైనా (1,037), బ్రిటన్ (1,019) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. కాగా, 2013లో ఇండియాలో యూహెచ్ఎన్ డబ్ల్యూ కుటుంబాల సంఖ్య కేవలం 284 మాత్రమే. వచ్చే సంవత్సరం ఆసియా పసిఫిక్ రీజియన్ లోని ధనవంతుల వద్ద ఉన్న డబ్బు నార్త్ అమెరికాను అధిగమిస్తుందని బోస్టన్ గ్రూప్ అంచనా వేస్తోంది. 2019 నాటికి ఆసియా పసిఫిక్ దేశాల్లోని అత్యంత ధనవంతుల వద్ద ఉన్న సంపద 57 ట్రిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,648 లక్షల కోట్లు) పెరగవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News