: ఆ 50 లక్షలు నా ఖాతా లోంచి వెళ్లినట్టు 'సాక్షి' నిరూపించగలదా?: సీఎం రమేష్
ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో తనకు సంబంధం లేదని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ స్పష్టం చేశారు. తన ఖాతాల నుంచి ఆ యాభై లక్షలు వెళ్లినట్టు సాక్షి మీడియా నిరూపించగలదా? అని సవాల్ చేశారు. ఒకవేళ సాక్షి మీడియా నిరూపించకపోతే వైఎస్ జగన్ రాజీనామాకు సిద్ధమా? అని రమేష్ సూటిగా ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టి.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఇచ్చిన రూ.50 లక్షలు ఎంపీ రమేష్ ఖాతా నుంచే డ్రా చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.