: ట్విట్టర్ ప్రియులకు శుభవార్త... 140 కాదు, 14 వందలైనా ఓకే!


సామాజిక మాధ్యమంగా సమాచారాన్ని సెకన్లలో లక్షలాది మందికి చేరుస్తున్న మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఖాతాదారులకు ఇది శుభవార్తే. ట్విట్టర్ లో ఏదైనా పోస్టు చేయాలంటే గరిష్ఠంగా 140 అక్షరాలు మాత్రమే పోస్టవుతాయన్న సంగతి తెలిసిందే. దీంతో సెలబ్రిటీల నుంచి, నెటిజన్ల నుంచి తమ సమాచారాన్ని పొడి అక్షరాలుగా, అబ్రివేషన్లుగా కుదించి పోస్టు చేస్తుంటారు. ఇకపై ఈ ఇబ్బంది తప్పనుంది. జూలై నుంచి అక్షరాల సంఖ్యపై ఆంక్షలను తీసివేస్తున్నామని, పదివేల లెటర్స్ తో అయినా, మెసేజ్ పెట్టుకోవచ్చని ట్విట్టర్ తెలిపింది. 140 అక్షరాల్లో మెసేజ్ పెట్టాలంటే కష్టంగా ఉంటోందని ఖాతాదారుల నుంచి ఫిర్యాదులు రావడం, ఇదే సమయంలో ఫేస్ బుక్, వాట్స్ యాప్ తదితరాలు అక్షరాలపై పరిమితిని విధించకపోవడంతో, పోటీలో నిలవాలంటే అక్షర కట్టడి తొలగించాలని భావించిన ట్విట్టర్ యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News