: దీని భావమేమి?... రాజకీయ వేడి రగులుతున్న వేళ సెలవుపై వెళ్లిన తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డి
తెలుగు రాష్ట్రాల్లో 'ఓటుకు నోటు'పై విచారణ కీలక దశకు చేరి ఏ క్షణం ఏం జరుగుతుందో! అని రాజకీయ నాయకులు ఆందోళనలకు గురవుతున్న వేళ తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. ఆయన సెలవుకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఇదే సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా అదనపు బాధ్యతలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ మహేందర్ రెడ్డికి అప్పగిస్తూ, తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. కీలక సమయంలో శివధర్ రెడ్డి సెలవుపై వెళ్లడం చర్చనీయాంశమైంది. ఆయన నిర్ణయం వెనుక గల కారణాలపై పోలీసు వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.