: ఏఎస్పీ స్థాయి అధికారికి ‘ఓటుకు నోటు’ బాధ్యతలు...అశోక్ కుమార్ స్థానంలో మల్లారెడ్డి
'ఓటుకు నోటు' కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ప్రత్యక్ష పోరుకు తెరలేపిన ఈ కేసులో నిందితుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. అయితే ఇప్పటిదాకా ఈ కేసు దర్యాప్తును ఏసీబీలో డీఎస్పీగా పనిచేస్తున్న అశోక్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. తాజాగా ఆయన నుంచి కేసును మల్లారెడ్డి అనే పోలీసు అధికారికి బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏఎస్పీ స్థాయి అధికారి అయిన మల్లారెడ్డి నిన్నటిదాకా పాలమూరు జిల్లా ఏఎస్పీగా పనిచేశారు. అక్కడి నుంచి ఆయనను నిన్న ఉన్నపళంగా బదిలీ చేసిన ప్రభుత్వం ఏసీబీలో ఏఎస్పీగా పోస్టింగ్ ఇచ్చింది. అంతేకాక మరింత మంది సీనియర్ పోలీసు అధికారులను ప్రభుత్వం ఏసీబీకి బదిలీ చేసింది. ఇలా ఏసీబీకి బదిలీ అయిన వారిలో సీఐడీలో ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ చారుసిన్హా, కరీంనగర్ ఎస్పీగా ఉన్న శివశంకర్ కూడా ఉన్నారు.