: 'ఆంధ్రా సెల్వం' ఎవరు?... చంద్రబాబు సీటుపై సోషల్ మీడియా ఆసక్తికర చర్చ!


తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చుపెట్టిన ఓటుకు నోటు వ్యవహారంపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చకు తెరలేచింది. ఆంధ్రా సెల్వం ఎవరు? అన్న ప్రశ్నను సంధించిన నెటిజన్లు మల్టీపుల్ చాయిస్ కింద లోకేశ్, బాలకృష్ణ, యనమల రామకృష్ణుడు, కోడెల శివప్రసాద్, అశోకగజపతిరాజుల పేర్లను ప్రస్తావించారు. ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం అరెస్ట్ కానున్నారని, ఆయన స్థానంలో ఏపీ సీఎం బాధ్యతలు ఎవరు చేపడతారన్న ఊహాగానాలపై ఫేస్ బుక్ లో కనిపిస్తున్న ఈ పోస్ట్ హల్ చల్ చేస్తోంది. అక్రమాస్తుల కేసులో అరెస్టైన తమిళనాడు సీఎం జయలలిత తన కుర్చీని పన్నీరు సెల్వంకు అప్పగించారని... ఏపీలోనూ చంద్రబాబు ఎవరికో ఒకరికి పదవి అప్పగించక తప్పదన్న భావన వచ్చేలా ఈ పోస్టింగ్ దర్శనమిస్తోంది. ఇక ఫేస్ బుక్ లోనే కాక ట్విట్టర్ లోనూ ఓటుకు నోటు వ్యవహారంపై పలు ఆసక్తికర పోస్టింగ్ లు దర్శనమిస్తున్నాయి. కొన్ని పోస్టింగుల్లో నెటిజన్లు అసభ్యకర వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

  • Loading...

More Telugu News