: మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్... ఖైరతాబాదు ఫ్లై ఓవర్ పై నుజ్జునుజ్జయిన కారు
మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ ఘటనలు హైదరాబాదులో నిత్యకృత్యమయ్యాయి. రాత్రి పొద్దుపోయేదాకా మద్యం సేవిస్తున్న బడాబాబుల పిల్లలు తెల్లవారుజామున తమ కార్లతో రోడ్లపైకి వస్తూ బీభత్సం సృష్టిస్తున్నారు. ఈ తరహా ఘటనల్లో యువకులతో పాటు యువతులు కూడా పట్టుబడిన ఘటనలు నమోదయ్యాయి. తాజాగా నేటి తెల్లవారుజామున ఇదే తరహాలో ఓ యువకుడు మద్యం మత్తులో జోగుతూ తన కారుతో ఖైరతాబాదు ఫ్లై ఓవర్ పై ర్యాష్ గా దూసుకెళ్లాడు. డివైడర్ ను ఢీకొట్టిన కారు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదంలో సదరు యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.