: టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు
ఓటుకు నోటు వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యకు ఏసీబీ నోటీసులు పంపింది. సీఆర్పీసీ 160 కింద ఈ నోటీసులు జారీ చేశారు. హైదర్ గూడలోని సండ్ర క్వార్టర్ నెం.208కి ఏసీబీ అధికారులు నోటీసులతో వెళ్లారు. అయితే, ఆ సమయంలో సండ్ర అక్కడ లేకపోవడంతో, నోటీసుల సమాచారం అందించారు. విచారణాధికారి ముందు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.